📄 ePaper
Monday, April 13, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణహోలీ మేరీ కళాశాలలో సిల్వర్ జూబ్లీ సంబరాలు

హోలీ మేరీ కళాశాలలో సిల్వర్ జూబ్లీ సంబరాలు

📰 Generate e-Paper Clip

హోలీ మేరీ కళాశాలలో సిల్వర్ జూబ్లీ సంబరాలు

కీసర, మార్చి 27(ప్రజాక్షేత్రం):మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం బోగారం లోని హోలీ మేరీ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జేఎన్టీయూ రిజిస్ట్రార్ డా.కే.వెంకటేశ్వర రావు ముఖ్య అతిథిగా, మురళి బుక్కపట్నం విశిష్ట అతిథిగా హాజరయ్యారు. రిటైర్డ్ అదనపు డీజీపీ డా.కే.బాబురావు, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కళాశాల ప్రెసిడెంట్ వరప్రసాద్ రెడ్డి, సెక్రటరీ శారదారెడ్డి, చైర్మన్ సిద్ధార్థరెడ్డి తదితరులు జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ విద్యాసంస్థ నేటి స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడి సేవలు అందిస్తున్నారని తెలిపారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఇంజనీరింగ్‌తో పాటు సివిల్స్, న్యాయ రంగాల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. సమాజాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular