వనపర్తిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు.
వనపర్తి, మార్చి 29(ప్రజాక్షేత్రం):తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పట్టణంలోని హనుమాన్ టేకిడిలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను రామన్ గౌడ్ ఆవిష్కరించగా, కమాన్ చౌరస్తాలో శ్రీనివాస్ రెడ్డి జెండాను ఎగురవేశారు. అనంతరం పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ బి రాములు మాట్లాడుతూ, “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే మహత్తర భావజాలంతో ప్రజలకు సేవలందించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజా సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర నాయకులు ఎండి దస్తగిరి, న్యాయవాది షాకీర్ హుస్సేన్, వనపర్తి మండల నాయకులు చిట్యాల బాలరాజ్, అప్పాయపల్లి బాలయ్య, ఉపేందర్, దాసు పాల్గొన్నారు. అలాగే పెద్దమందడి మండల నాయకులు రాధాకృష్ణ, గణపురం మండల నాయకులు యాదయ్య, శ్రీను, పెబ్బేరు మండల నాయకులు సితార, వాకిటి బాలరాజు, రాఘవేందర్ గౌడ్ హాజరయ్యారు. వనపర్తి పట్టణ అధ్యక్షులు కాగితాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేదరి బాలయ్య, ఆవుల శీను, ఫారుక్ బి, శేఖర్, శివాచారి కృష్ణయ్య, ముక్తార్, రాజు మేస్త్రి, కొత్తగొళ్ల శంకర్, కె. గిరి, డి. బాలరాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడం, బైక్ ర్యాలీలతో పట్టణం అంతా కదిలిపోవడం విశేషం. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లో మరింత బలపడేలా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.


