📄 ePaper
Saturday, April 11, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణసమానత్వ స్ఫూర్తికి ప్రతీకగా పర్వతపూర్‌లో పులే–అంబేద్కర్ విగ్రహాల వైభవోపేత మహా ఆవిష్కరణ

సమానత్వ స్ఫూర్తికి ప్రతీకగా పర్వతపూర్‌లో పులే–అంబేద్కర్ విగ్రహాల వైభవోపేత మహా ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

సమానత్వ స్ఫూర్తికి ప్రతీకగా పర్వతపూర్‌లో పులే–అంబేద్కర్ విగ్రహాల వైభవోపేత మహా ఆవిష్కరణ

షాద్ నగర్ మార్చి 29(ప్రజాక్షేత్రం):కొందుర్గు మండలంలోని పర్వతపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పులే మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య వంటి విలువలను స్థాపించడంలో పులే మరియు అంబేద్కర్ పాత్ర అమూల్యమని పేర్కొన్నారు. వారి ఆశయాలు ప్రతి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, సమాజం ముందుకు సాగే దిశలో ప్రతి ఒక్కరూ వారి సిద్ధాంతాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంగులాల్ నాయక్, కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ రెడ్డి, కేకే కృష్ణ, సాదిక్, మల్లేష్, ఎస్సై రవీంద్ర నాయక్, పర్వతపూర్ సర్పంచ్ బోయ అశోక్, కడిగళ్ళ మహేందర్, దుర్గని శ్రీను, రామగాళ్ల సుందర్ పాల్గొన్నారు. అలాగే కొందుర్గు మండల కేంద్రానికి చెందిన పలువురు నాయకులు మరియు పర్వతపూర్ గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించడంతో పాటు సమానత్వం మరియు సామాజిక న్యాయం పట్ల ప్రజల్లో కొత్త స్పూర్తిని నింపింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular