వార్డ్ సభలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్
శంకర్ పల్లి జూన్ 06(ప్రజాక్షేత్రం):శంకరపల్లి మున్సిపల్లో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికల 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా 7వ వార్డు రామంతపురంలో వార్డు సభకు మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. చేవెళ్ల రోడ్ నుంచి రామంతపురం వరకు బాలన్స్ వర్క్ రూ.7.4 లక్షలతో సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్వేతా పాండురంగారెడ్డి, కౌన్సెలర్లు బండ్లగూడెం ప్రశాంత్, చాకలి అశోక్ పాల్గొన్నారు.

