📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణసాంకేతిక పరిజ్ఞానంతో ఇల్లు పైకి.. వనపర్తి జిల్లాలో ఆసక్తికర ఘటన!

సాంకేతిక పరిజ్ఞానంతో ఇల్లు పైకి.. వనపర్తి జిల్లాలో ఆసక్తికర ఘటన!

📰 Generate e-Paper Clip

సాంకేతిక పరిజ్ఞానంతో ఇల్లు పైకి.. వనపర్తి జిల్లాలో ఆసక్తికర ఘటన!

వనపర్తి జూన్ 14(ప్రజాక్షేత్రం):ఇల్లు కిందకు అయిందని పడగొట్టి కొత్తది కట్టాలంటే రూ.20 నుండి 25 లక్షలు ఖర్చవుతుందని ఆత్మకూరు మున్సిపాలిటీ ఒకటో వార్డు కానాపురానికి చెందిన ఎస్. రాములు (తండ్రి ఆశన్న) ఆందోళన చెందారు. ఈ క్రమంలో బీహార్‌కు చెందిన కాంట్రాక్టర్లు జాకీల సాయంతో ఇంటిని దెబ్బతినకుండా పైకి లేపుతామని చెప్పడంతో ఆయన రూ.4 నుండి 5 లక్షల ఖర్చుతో వారితో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా శనివారం వందలాది జాకీల సహాయంతో ఇంటిని విజయవంతంగా ఒక అడుగు పైకి లేపారు. మొత్తం 4 నుండి 5 ఫీట్ల ఎత్తు వరకు ఈ ఇంటిని పెంచనున్నారు. వనపర్తి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి వినూత్న సాంకేతికతతో ఇల్లు పైకి లేపుతుండటంతో స్థానిక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడో టీవీల్లో చూసిన ఈ వింత ఇప్పుడు తమ కళ్ల ముందే జరుగుతుండటంతో, దీనిని చూసేందుకు చుట్టుపక్కల జనం భారీగా తరలివస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular