📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeఉద్యోగం*డిగ్రీ అర్హతతో SBIలో 1500 ఉద్యోగాలు..*

*డిగ్రీ అర్హతతో SBIలో 1500 ఉద్యోగాలు..*

📰 Generate e-Paper Clip

*డిగ్రీ అర్హతతో SBIలో 1500 ఉద్యోగాలు..*

– ఏడాదికి రూ.21 లక్షల వరకు జీతం పొందే ఛాన్స్.

హైదరాబాద్ జూన్ 19(ప్రజాక్షేత్రం):బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తంగా 1500 ప్రొబేషనరీ ఆఫీర్‌ (పీవో) పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో రెగ్యులర్‌ పోస్టులు 1446, బ్యాక్‌లాగ్‌ పోస్టులు 54 వరకు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జులై 8, 2026లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు ఏప్రిల్ 1, 2026 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాల వరకు వయసులో సడలింపు ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular