📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణమహిళా విద్యార్థుల పై చేయి చేసుకున్న సిఐ

మహిళా విద్యార్థుల పై చేయి చేసుకున్న సిఐ

📰 Generate e-Paper Clip

మహిళా విద్యార్థుల పై చేయి చేసుకున్న సిఐ

ఆదిభట్ల జూన్ 23(ప్రజాక్షేత్రం):ఆందోళన చేస్తున్న మహిళా విద్యార్థుల పై ఆదిభట్ల సిఐ రవి కుమార్ చేయి వేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా తూర్జయంజల్ న్యూ శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. దీంతో చౌరస్తాలో భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి దర్నా చేస్తున్న విద్యార్థినిలపై చెయ్యి చేసుకున్నాడు.సిఐ రవికుమార్ తీరుపై పోలీస్ ఉన్నతాధికారుల సీరియస్ అయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular