📄 ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్బావిలో దూకి ఆత్మ హత్యయత్నానికి పాల్పడిన ముగ్గురు.

బావిలో దూకి ఆత్మ హత్యయత్నానికి పాల్పడిన ముగ్గురు.

📰 Generate e-Paper Clip

– తల్లి కూతురు మృతి చెందగా..కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

శంకర్ పల్లి, జూలై 17(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లి తన ఇద్దరి పిల్లలతో అదే గ్రామంలో ఓ పాడు పడ్డ బావిలో గురువారం రాత్రి 11 గంటలకు బావిలో దూకగా తల్లి వసంత (35) కూతురు నవ్య (14) మృతి చెందగా కొడుకు వేణు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. భర్త సుధాకర్ వికారాబాద్ జిల్లా యాలాల్ మండల్ నుంచి గత 12 సంవత్సరాల క్రితం కొత్తపల్లి గ్రామానికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మృతికి గల కారణాలు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు తెలిపారు. అయితే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular