రానున్న 3 రోజుల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు..
హైదరాబాద్ జులై 26(ప్రజాక్షేత్రం):బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాతావరణ మార్పుల ప్రభావం తెలంగాణపై కూడా ఉండనుంది. రాగల రెండు మూడ్రోజుల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్టుగా వెదర్ మ్యాన్ అంచనా వేశారు. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉంది. హైదరా బాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడ చినుకులు లేదా మోస్తరు వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఉపరితల గాలులు బలంగా వీచే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ, జిహెచ్‌ఎంసి అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణాలు చేసే వారు, లోతట్టు ప్రాంతాల నివాసితులు వాతావరణ హెచ్చరికలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

