📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణరేట్లు ఇష్టం.. దందా ఘనం!

రేట్లు ఇష్టం.. దందా ఘనం!

📰 Generate e-Paper Clip

రేట్లు ఇష్టం.. దందా ఘనం!

  • సిండికేట్ చేతిలో ధరల దోపిడీ
  • దుకాణాల్లో ఒక రేటు.. బెల్టుల్లో మరో రేటు
  • అధికారుల చర్యల కోసం మద్యం ప్రియుల ఎదురుచూపు

అనంతగిరి ఆగస్టు 11(ప్రజాక్షేత్రం):నిబంధనలు ఒకటి.. ఆచరణ మరొకటి.. అమ్మకాలు ఇంకొకటి అన్నట్లుగా మండలం లోని మద్యం విక్రయాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం దుకాణాలు, బెల్టు దుకాణాల వద్ద అధిక ధరల వసూళ్లు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పలుచోట సిండికేట్‌గా ఏర్పడి ధరలను తమ ఇష్టానుసారం పెంచి విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో అధిక ధరల విక్రయాలపై చర్చ జరుగుతోంది. మద్యం దుకాణాల వద్ద ధరల పట్టికలు స్పష్టంగా కనిపించకపోవడంతో వినియోగదారుల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నా సంబంధిత శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో అధిక ధరల విక్రయాలపై ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బెల్టుల్లో ఒక రేటు.. దుకాణాల్లో మరో రేటు..!

మద్యం దుకాణాల్లో అందుబాటులో లేని కొన్ని బ్రాండ్లు బెల్టు దుకాణాల్లో లభిస్తుండటం, వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మద్యం ప్రియులు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. బెల్టు దుకాణాలపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.

ప్రభుత్వ నిబంధనలు గాలిలోసేనా..!

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మద్యం విక్రయాలు జరగాల్సి ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిర్ణీత ధరలకే మద్యం విక్రయించేలా అధికారులు పర్యవేక్షణ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా తనిఖీలు చేపట్టాలి..!

మండల వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బెల్టు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు. ధరల పట్టికలు తప్పనిసరిగా ప్రదర్శించేలా చూడడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే అధిక ధరల దందాకు అడ్డుకట్ట పడుతుందని వారు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular