
నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల పరిశీలన
ఘట్కేసర్, సెప్టెంబరు 9(ప్రజా క్షేత్రం): వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి (ఐఏఎస్), ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా (ఐఏఎస్) అధికారులను ఆదేశించారు. ఎదులాబాద్, రాంపల్లి చెరువుల్లోని నిమజ్జన ప్రాంతాలను వారు పరిశీలించారు. ఎదులాబాద్ చెరువులో గత పదేళ్లుగా నిమజ్జనం చేసిన విగ్రహాల అవశేషాలను లాంగ్‌బూమ్ హిటాచీతో తొలగిస్తున్న పనులను పరిశీలించారు. రాబోయే నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీ వాణిరెడ్డి, ఇంజినీరింగ్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

