📄 ePaper
Sunday, September 20, 2026
📄 ePaper
Homeఉద్యోగంపోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు రేపే చివరి తేదీ!

పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు రేపే చివరి తేదీ!

📰 Generate e-Paper Clip

పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు రేపే చివరి తేదీ!

హైదరాబాద్ సెప్టెంబర్ 15(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్  చేపట్టిన పోలీస్, ఫైర్, జైలు శాఖలో ఉద్యోగాల కొరకు  దరఖాస్తు చేసుకొని వారికి కీలక సమా చారం.  7,437 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తుల గడువు రేపటితో అంటే సెప్టెంబర్ 16తో ముగియనుంది. ఇప్పటికే సిద్ధమైన అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికా రులు సూచిస్తున్నా రు. వాస్తవానికి ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 9వ తేదీతోనే పూర్తి కావాల్సి ఉంది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సాంకేతిక పరిస్థితులను పరిగ ణనలోకి తీసుకుని రిక్రూట్‌మెంట్ బోర్డ్ గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగించింది. దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ముగింపు సమయం వరకు వేచి చూడకుండా టీఎస్ ఎల్పీఆర్ బి అధికారిక వెబ్‌సైట్ https://www.tgprb.in/ ద్వారా వెంటనే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య తక్కువగా ఉందం టూ పలువురు నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుల సంఖ్యను పెంచాలని, దరఖాస్తు తేదీని మరికొన్ని రోజులు పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్న నేపథ్యంలో బోర్డు ఎలాంటి నిర్ణ యం తీసుకుంటుందో వేచి చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular