📄 ePaper
Sunday, September 20, 2026
📄 ePaper
Homeతెలంగాణమార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా పంకజ్‌కుమార్‌ మీనా

మార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా పంకజ్‌కుమార్‌ మీనా

📰 Generate e-Paper Clip

మార్కాపురం, సెప్టెంబరు 20(ప్రజాక్షేత్రం):మార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా ఐపీఎస్‌ అధికారి పంకజ్‌కుమార్‌ మీనా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం పలువురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పోలవరం ఓఎస్డీగా పనిచేస్తున్న పంకజ్‌కుమార్‌ మీనాను మార్కాపురం జిల్లా ఎస్పీగా నియమించింది. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు తొలి ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular