పొద్దుటూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
- అర్హులైన పేద కుటుంబాలకు కార్డులు అందజేసిన సర్పంచ్ బండ లక్ష్మి నర్సింహా
- ప్రతి అర్హులైన కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి
- బొల్లరం వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
శంకర్ పల్లి సెప్టెంబర్ 23(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండలం పొద్దుటూరు గ్రామంలో బుధవారం సర్పంచ్ బండ లక్ష్మి నర్సింహా ఆధ్వర్యంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌తో పాటు గ్రామ పాలకవర్గం, నాయకులు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేద కుటుంబాలకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తోందన్నారు. రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కావేలి గోవర్ధన్ రెడ్డి వాట్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

