- రామ్లీలా మైదానానికి భారీ ర్యాలీలో పాల్గొన్న శంకర్ పల్లి మున్సిపల్, మండల కాంగ్రెస్ నాయకులు
శంకర్ పల్లి నవంబర్ 01(ప్రజాక్షేత్రం):ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓట్ల దొంగతనాన్ని అరికట్టడం, రాజ్యాంగాన్ని కాపాడాలనే లక్ష్యంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపు మేరకు నవంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు శంకర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, డిసిసి వైస్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, శంకర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ బొల్లారం వెంకట్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి రామ్లీలా మైదానం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీలో ముందుకు సాగుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని బొల్లారం వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో పాల్గొనడం ద్వారా శంకర్పల్లి కాంగ్రెస్ నాయకులు పార్టీ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి రామ్లీలా మైదానం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సాగిన ర్యాలీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. శంకర్పల్లి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మడపతి చంద్రమౌళి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పార్శి బాలకృష్ణ, పొడవు శ్రీనివాస్, మోకిలా సర్పంచ్ శేఖర్, మోకిలా పీఏసీఎస్ చైర్మన్ సత్యం, రఘునందన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ మల్లికార్జున్, మార్కెట్ డైరెక్టర్లు ప్రశాంత్, భాస్కర్ రెడ్డి, యాదిరెడ్డి, శంకర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



