Homeతెలంగాణచికిత్స పొందుతూ మహిళా కండక్టర్ ప్రవళిక మృతి

చికిత్స పొందుతూ మహిళా కండక్టర్ ప్రవళిక మృతి

📰 Generate e-Paper Clip

  • కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటాయి.
  • మంత్రి పొన్నం ప్రభాకర్.

హైదరాబాద్ నవంబర్ 04(ప్రజాక్షేత్రం):మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మరణంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్టోబర్ 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో టికెట్, చిల్లర విషయంలో ప్రయాణికురాలితో ప్రవళికకు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అశ్వాపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు బస్సును ముందుకు నడపాలని డ్రైవర్‌కు సూచించగా, ప్రయాణికురాలు తోసివేయడంతో ఆమె కదులుతున్న బస్సు వెనుక చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. తొలుత భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించినప్పటికీ మృతి చెందడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటాయని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular