కరీంనగర్ నవంబర్ 18(ప్రజాక్షేత్రం):శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి సంచారం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ పరిసరాల్లో ఎలుగుబంటి కనిపించడంతో విద్యార్థులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపైకి ఎలుగుబంటి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యూనివర్సిటీ పరిధిలో అడవిని ధ్వంసం చేయడం వల్లే ఎలుగుబంటి జనావాసాల్లోకి వస్తోందని, అధికారుల నిర్లక్ష్యం దీనికి కారణమని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ఎలుగుబంటిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

