📄 ePaper
Tuesday, February 24, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణపెబ్బేరు పట్టణ అభివృద్ధికి కృషి.

పెబ్బేరు పట్టణ అభివృద్ధికి కృషి.

📰 Generate e-Paper Clip

పెబ్బేరు పట్టణ అభివృద్ధికి కృషి.

– పెబ్భైర్ మున్సిపల్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం.


– ఓడినవారికి కూడా సమాన గౌరవం. ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ శివసేనరెడ్డి


పెబ్బేరు, ఫిబ్రవరి 18 (ప్రజాక్షేత్రం ):ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, గెలిచిన కౌన్సిలర్లతో సమానంగా వారికి కూడా ప్రాధాన్యత ఉంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనరెడ్డి పేర్కొన్నారు.బుధవారం పెబ్బేరు మున్సిపాలిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అక్కి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సుమిత్ర ఎల్లారెడ్డిలను మున్సిపల్ కార్యాలయంలో వారు సన్మానించి అభినందించారు. చైర్మన్, వైస్ చైర్మన్ బాధ్యత స్వీకరణ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఊరేగింపును నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ శివసేనరెడ్డి లకు కు గజమాలతో సత్కారం చేసి, పూల వర్షం కురిపిస్తూ బాణాసంచా కాల్చి, డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. సుభాష్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరిని పెబ్బేరు ప్రజలు ఆదరించారని తెలిపారు. ఆ విశ్వాసంతోనే అక్కి శ్రీనివాస్ గౌడ్ చైర్మన్‌గా, సుమిత్ర ఎల్లారెడ్డి వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. పెబ్బేరు పట్టణానికి సంబంధించిన 30 పడకల ఆసుపత్రి, రోడ్డు విస్తరణ, సంత స్థల వివాద పరిష్కారం, సీసీ రోడ్లు, వీధిలైట్లు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి ఏడాదిలో పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పట్టణ మరియు మండల కాంగ్రెస్ నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular