మహా ప్రభంజనంతో చేవెళ్ళ మున్సిపల్ పాలక వర్గo యొక్క ఘన సన్మాన మహోత్సవం…..
చేవెళ్ళ ఫిబ్రవరి 23(ప్రజాక్షేత్రం):సోమవారం చేవెళ్ల కేజీఆర్ గార్డెన్లో జరిగిన చేవెల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ దేవర సమత రెడ్డి వెంకట్ రెడ్డి గారూ మరియు కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమం జరిగింది సన్మాన కార్యక్రమానికి హాజరైన తెలంగాణ శాసన సభ్యులు ఐటీ శాఖ మంత్రి రంగారెడ్డి ఇంచార్జ్ దుదిల్ల శ్రీధర్ బాబు రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి శాసనసభ్యులు కాలే యాదయ్య హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ TUFidc చైర్మన్ చల్లా నరసింహారెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి. తో పాటు ఈ సన్మాన సభలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ ఎలగంటి మధుసూదన్ రెడ్డి గారు చేవెళ్ల మాజీ జెడ్పీటీసీ మంగలి బాల్ రాజ్, మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్ షాబాద్ సోనియా దర్శన్ తదితరులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ…. ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గెలుపు అనే భావించకుండా బాధ్యత అని భావించి పనిచేయాలని భావించారు. కొత్తగా ఏర్పడిన చేవెళ్ల శంకర్ పల్లి మొయినాబాద్ మున్సిపల్ అయినందువల్ల తగిన కోరిన బడ్జెట్ కు . ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యలను పరిష్కారించాలని, ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూడాలనీ పేర్కొన్నారు అదేవిధంగా చిప్ విప్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లోఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో మళ్ళి అన్ని గెలుస్తాం మహేందర్ రెడ్డి అని కూడా చెప్పారు. ఇకపై వచ్చే ఎన్నికల్లో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో కచ్చితంగా మన పార్టీ గెలవాలని సభాముఖంగా తెలిపారు



