📄 ePaper
Saturday, April 11, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణశంకర్ పల్లి మున్సిపల్ లో మాదిగ లకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలి.

శంకర్ పల్లి మున్సిపల్ లో మాదిగ లకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలి.

📰 Generate e-Paper Clip

శంకర్ పల్లి మున్సిపల్ లో మాదిగ లకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలి.

– శంకర్ పల్లి మాదిగలకు సముచిత ప్రతినిధిత్వం కల్పించాలి

– ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్

శంకర్ పల్లి ఫిబ్రవరి 14(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపాలిటీలో మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ అన్నారు. శంకర్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన‌ మాదిగలకు వైస్ చైర్మన్ పీఠం కట్టబెట్టాలని స్థానిక నాయకులు, ప్రజలు, సామాజిక వర్గాలు స్పష్టం చేస్తున్నారు. కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ…పట్టణ కేంద్రంలో అత్యధిక ఓటు ఉన్నాయి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం న్యాయమని పేర్కొన్నారు. శంకర్ పల్లి మున్సిపాలిటీలో మాదిగలకు సమాజానికి తగిన గౌరవం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు విశ్వాసంతో గెలిపించిన అభ్యర్థులకు బాధ్యతలు అప్పగించకపోతే అది సామాజిక న్యాయానికి విరుద్ధమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య తక్షణం జోక్యం చేసుకుని మాదిగ వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైస్ చైర్మన్‌గా నియమిస్తే పట్టణాభివృద్ధికి మరింత ఊపందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular