📄 ePaper
Wednesday, March 25, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణ“అక్రమ షెడ్డు పూర్తి దశలో…టౌన్ ప్లానింగ్ అధికారులు చూస్తూ చూస్తూ ఊరుకుంటున్నారా?”

“అక్రమ షెడ్డు పూర్తి దశలో…టౌన్ ప్లానింగ్ అధికారులు చూస్తూ చూస్తూ ఊరుకుంటున్నారా?”

📰 Generate e-Paper Clip

“అక్రమ షెడ్డు పూర్తి దశలో…టౌన్ ప్లానింగ్ అధికారులు చూస్తూ చూస్తూ ఊరుకుంటున్నారా?”

“జీరో పర్మిషన్ షెడ్డు…20 రోజులుగా చర్యలు లేవు!”

“చర్యలు తీసుకుంటాం అన్న మాటే…షెడ్డు పూర్తి దశలో!”

కుత్బుల్లాపూర్,మార్చి 13(ప్రజాక్షేత్రం):దుండిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్‌పల్లి టెక్ మహీంద్రా ఎదురుగా జీరో పర్మిషన్‌తో నిర్మిస్తున్న భారీ షెడ్డు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే భారీ స్థాయిలో నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో ఆశ్చర్యకరమైన మౌనం పాటిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణంపై ఇప్పటికే రెండు సార్లు వార్త కథనాలు వెలువడినప్పటికీ టౌన్ ప్లానింగ్ ఏసిపి మాత్రం “చర్యలు తీసుకుంటాం” అనే మాట తప్ప ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇదే సమయంలో నిర్మాణ పనులు మాత్రం వేగంగా సాగి ప్రస్తుతం షెడ్డు పూర్తికి చేరువలో ఉండటం గమనార్హం.

నోటీసులు ఇచ్చారా?..వివరాలు ఎందుకు రహస్యం?

ఈ నిర్మాణంపై ఇప్పటివరకు ఎన్ని నోటీసులు జారీ చేశారన్న ప్రశ్నలకు సంబంధిత అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిజంగా నోటీసులు ఇచ్చి ఉంటే వాటి వివరాలను వెల్లడించడంలో అభ్యంతరం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
బహదూర్‌పల్లి టెక్ మహీంద్రా సమీపంలో నిర్మిస్తున్న ఈ భారీ షెడ్డు కు దుండిగల్ సర్కిల్ లేదా హెచ్ఎండిఏ నుంచి ఎలాంటి అనుమతులు ఉన్నాయా అనే అంశం కూడా సందేహాస్పదంగా మారింది. ఒకవేళ అనుమతులు ఉన్నట్లయితే వాటి పత్రాలను మీడియాకు చూపించడంలో అధికారులకు అభ్యంతరం ఎందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి ఈ అక్రమ షెడ్ నిర్మాణం పైన చర్యలు తీసుకుంటారా…లేక మౌనంగానే ఉంటారా? వేచి చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular