📄 ePaper
Saturday, May 23, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవసూళ్లకు నిలయాలు..అవినీతికి ఆనవాళ్లు…సబ్-రిజిస్ట్రేషన్..కార్యాలయాలు..

వసూళ్లకు నిలయాలు..అవినీతికి ఆనవాళ్లు…సబ్-రిజిస్ట్రేషన్..కార్యాలయాలు..

📰 Generate e-Paper Clip

వసూళ్లకు నిలయాలు..అవినీతికి ఆనవాళ్లు…
సబ్-రిజిస్ట్రేషన్..కార్యాలయాలు..

– ఒక్కో డాక్యుమెంట్కు ₹1000 రూపాయలు…

– సంతకాలకు ₹100 చొప్పున వసూల్…

– షాద్ నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమార్కుల చేతివాటం.

– పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది

వికారాబాద్ జిల్లా బ్యూరో మార్చి13 (ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో సబ్-రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వసూళ్లకు నిలయాలుగా మారాయి. అవినీతికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. పత్రాలన్నీ సక్రమంగా ఉన్నా.. ఎంతోకొంత ముట్టచెబితేనే పక్కాగా పని అవుతుంది. కొందరు డాక్యుమెంట్ రైటర్లే వసూళ్ల రాయుళ్లుగా చలామని అవుతున్నారు. అధికారుల వాటా కలుపుకునే డాక్యుమెంట్ తయారీ ఖర్చుల కింద వసూలు చేస్తున్నారు.రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో తరచూ లంచాలు తీసుకుంటూ అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి.. రిజిస్ట్రేషన్లు చేసి అందిన మేరకు దోచుకుంటున్నారు. ఆస్తి విలువను బట్టి కనీసం రూ.2 వేల నుంచి రూ.లక్షల వరకు వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్కు అనుకూలంగా పత్రాల తయారీకయ్యే ఖర్చులతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ముట్టజెప్పాల్సిన సొమ్మును డాక్యుమెంట్ రైటర్లు తీసుకుంటున్నారు. లింకు డాక్యుమెంట్లు సక్రమంగా లేకపోవడం, సాక్షులు అందుబాటులో లేకపోతే సర్దుబాటు చేయడం, రిజిస్ట్రేషన్ విలువ తగ్గించి చూపించేందుకు ముక్కు పిండి అదనంగా గుంజుతున్నారు.

సంధ్యా వేళల్లో వసూల్….

అన్న నమస్తే… మన షాప్ నుండి ఇవాళ ఎన్ని డాక్యుమెంట్లు వచ్చినాయి..? సార్ పంపిండు లేట్ అయితుంది త్వరగా చెప్పు..? అంటూ డాక్యుమెంట్ రైటర్ అదే గారికి ఓ వ్యక్తి డాక్యుమెంట్ కు వెయ్యి రూపాయలు చొప్పున సాయంత్రం వసూలు చేస్తూ జమ చేసిన నగదు సదర్ అధికారులు భాగస్వాములై పంచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత సంతకానికి ₹100 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదెలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు జరుగుతున్న అధికారులను మాత్రం చర్లం లేదని ప్రజలు నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login