📄 ePaper
Saturday, April 11, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణపచ్చని పొలాల్లో పరిశ్రమలు ఎలా…?

పచ్చని పొలాల్లో పరిశ్రమలు ఎలా…?

📰 Generate e-Paper Clip

పచ్చని పొలాల్లో పరిశ్రమలు ఎలా…?

– పరిశ్రమల ఏర్పాటుకు వేలాది ఎకరాల పొలాలు ధ్వంసం

– తగిన పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కున్న వైనం

– పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకే భూముల కేటాయింపు

– వ్యవసాయం ఉత్పత్తిరంగం కాదా? అని అన్నదాతల ఆగ్రహం

– ప్రాణాలు పోయినా ఇచ్చేది లేదని వెల్లడి

వికారాబాద్ బ్యూరో 27(ప్రజాక్షేత్రం):ఒక పారిశ్రామికవేత్త పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఉత్పత్తులు అందించి, పది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, దేశ ఆర్థిక వృద్ధిలో భాగస్వామి అవుతారు’ అనే ఏకైక కారణంతో ప్రభుత్వాలు రైతుల నుంచి భూములను సేకరించి పరిశ్రమలకు కేటాయిస్తున్నారు . గత ప్రభుత్వాలు ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో ముందుకు సాగుతుంది. కానీ రైతులకు తగిన పరిహారం ఇవ్వకుండా ప్రత్యుత్తమయం చెప్పకుండా బలవంతంగా భూములు సేకరిస్తున్నారు. రాష్ట్రంలోని రైతులు ఆరుగాలం శ్రమించి ఆహారధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నారు. పది మందికి అన్నం పెడుతున్నారు. దేశ ఆహార భద్రతకు వెన్నెముకగా నిలుస్తున్నారు. గత కెసిఆర్ ప్రభుత్వమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కొని పరిశ్రమలకు కట్టబెడుతున్నారు. ఆ పచ్చని భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం రైతులను వేధిస్తున్నది. భూములు ఇవ్వనంటే కేసులు పెట్టి, బేడీలు వేసి జైళ్లకు పంపుతున్నది. నష్ట పరిహారం రూపాయి ఎక్కువ ఇవ్వమని వేడుకున్నా కనీసం కనికరించడం లేదు. పరిహారాన్ని కోర్టులో డిపాజిట్‌ చేసి మరీ భూములను గుంజుకుంటున్నది.* భూములే తమ జీవనాధారమని వాటిని తీసుకుంటే రోడ్డున పడతామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.తమ భూముల్లో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం యత్నించడంతో ఆందోళనలో ప్రజలు భూముల సేకరణకు నోటిఫికేషన్‌ జారీ అయినప్పటి నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్న రైతులు
ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం తమ భూములను లాక్కొంటుందనే ఆందోళనతో మండలంలోని కాళ్లాపూర్‌, రాపోల్ గ్రామాల రైతులు భయం గుప్పిట్లో విలవిలలాడుతున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములు సర్కారు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉన్న పొలాలు పొతే తాము రోడ్డునపడతామని.. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటున్నదని ఆవదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మండలంలోని కాళ్లాపూర్‌, రాపోల్‌ గ్రామాల పరిధిలో 1,197 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. భూసేకరణకు నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. అందుకోసం కాళ్లాపూర్‌ పరిధిలో 428.05 ఎకరాలు అసైన్డ్‌ , 159.25 ఎకరాల పట్టా భూములు, రాపోల్‌లో అసైన్డ్‌ భూములు 509 ఎకరాలు, 101.08 ఎకరాల పట్టా భూములను సేకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రైతులు గత పక్షం రోజులుగా తమకు తెలిసిన నాయకుడు, అధికారులు, కలెక్టర్‌ను కలిసి తమ భూములు లాక్కోవద్దని మొరపెట్టుకుంటున్నారు. తమ భూములను సర్కారు గుంజుకుంటుందనే సమాచారంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాళ్లాపూర్‌ గ్రామంలో ఏ నలుగురు ఒక చోట చేరినా తమ భూములు పోతాయంట, ఎట్ల బతకాలనే చర్చించుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిన్న తిండి పెయ్యికి పట్టడం లేదని, కంటికి నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, ఈ వయసులో ఎక్కడికి పోయి బతుకుతామని బాధపడుతున్నారు. సర్కారు తమకు డబ్బులు ఇస్తే ఏమి చేసుకుంటాం.. భూమి ఉంటే ఏదో ఓ పంట వేసి బతుకుతామని పేర్కొంటున్నారు. వేరుపడిన కుటుంబాలు 50 నుంచి 60 మంది వరకు ఉండగా వారి భూ ములన్నీ ఇండస్ట్రియల్‌ పార్కు కోసం చేపడుతున్న భూసేకరణలో పోతుండడంతో వారి ఆవేదన అంతా ఇంతా కాదు. మార్పు వస్తుందనుకొని ఆశపడి, తమ పిల్లలకు కొలువులు వస్తాయని కాంగ్రెస్‌ను గెలిపిస్తే తమ నోటికాడి బుక్కను లాక్కుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ బాధలు ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కల్పించుకొని తమ భూములను సర్కారు తీసుకోకుండా చూడాలని కోరుతున్నారు. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని వారు తేల్చి చెబుతున్నారు. చేసేది ఏమీ లేక ఎవరికి చెప్పిన ఏమి ప్రయోజనం లేదని రైతులు పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. బీజాపూర్ హైవే జాతీయ రహదారిపై చేపట్టిన ధర్నా రాస్తారోకో కారణంగా పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్దివాదం నెలకొంది. రైతులకు టిఆర్ఎస్, బిజెపి , సిపిఎం పార్టీ లు మద్దతు పలికాయి కాళపూర్, రాపోల్ గ్రామాలకు చెందిన 1197 ఎకరాలు అభివృద్ధి పేరుతో భూసేకరణ చెయ్యడం వెంటనే ఆపాలని నేడు కాళపూర్ రైతులు, గ్రామప్రజలు చేసిన పోరాటంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య మాట్లాడుతూ..కాళాపూర్ గ్రామంలో పేద రైతుల పంట భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో బలవంతంగా స్వాధీనం చేసుకోవడం తీవ్ర అన్యాయం. ఈ భూములే రైతుల జీవనాధారం, వాటిని కోల్పోతే కుటుంబాలు వీధిన పడే పరిస్థితి. సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ చేయకుండా ముందుకు సాగడం చట్ట విరుద్ధం. రైతుల అభిప్రాయాలను పట్టించుకోకుండా నోటిఫికేషన్ జారీ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. తక్షణమే భూసేకరణ ప్రక్రియను నిలిపివేసి, ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలి.
రైతుల హక్కులను రక్షించే వరకు మా పోరాటం కొనసాగుతుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular