📄 ePaper
Saturday, April 11, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణసిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన భీమ్ భరత్

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన భీమ్ భరత్

📰 Generate e-Paper Clip

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన భీమ్ భరత్

చేవెళ్ల మార్చి 29(ప్రజాక్షేత్రం):ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి (సిఎంఆర్ఎఫ్) సహాయ నిధి నుండి తెలంగాణ రాష్ట్ర సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మంజూరు అయిన చెక్కులను లబ్ధి దారులకి చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ లబ్ధిదారులకు అందజేశారు. చేవెళ్ళ, శంకర్ పల్లి, నవాబ్ పెట్, మొయినాబాద్, షాబాద్ మండలాల సంబంధించిన 65 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయం పేదల వరం అని తెలిపారు. మరియు వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ మొయినాబాద్ మండలం అధ్యక్షులు మాణయ్య, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి షాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, పోతుగల్ గ్రామ సర్పంచ్ నర్సింలు, దామర్లపల్లి మాజీ సర్పంచ్ బర్ల యాదయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ రెడ్డి, ప్రసాద్ గేట్ వనం పల్లీ, ఆసిఫ్, బందయ్య , బాలరాజు, సమీర్, ఆనందు, కౌన్సిలర్ అమరేందర్ రెడ్డి, కౌన్సిలర్ గీతా వనజాక్షి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular