📄 ePaper
Saturday, April 11, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణకాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఈ నెల 13న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఈ నెల 13న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఈ నెల 13న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి

కరీంనగర్ ఏప్రిల్ 03(ప్రజాక్షేత్రం):ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకోబోతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఆయన అధికారికంగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 13వ తేదీన జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ రాజకీయ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పార్టీ మార్పు ప్రక్రియలో భాగంగా ఈ నెల 7వ తేదీన కీలక పరిణామం చోటుచేసుకోనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్తారు. పార్టీలోకి రావాలని ఆయనను సాదరంగా ఆహ్వానిస్తారు. కేటీఆర్ పర్యటనతో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ సందడి మొదలుకానుంది. జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాల కోటలో బీఆర్ఎస్ బలం రెట్టింపు అవుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆయన వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు రావడం వల్ల ఉమ్మడి జిల్లాలో పార్టీకి కొత్త ఊపిరి పోసినట్లవుతుందని గులాబీ నేతలు లెక్కలు వేస్తున్నారు. కేవలం చేరికతోనే ఆగకుండా.. జీవన్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అపూర్వ ఘట్టం ముగిసిన వెంటనే జగిత్యాలలోనే పార్టీ ప్లీనరీ నిర్వహించాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తోంది. ప్లీనరీ ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే కాకుండా ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరిక పంపాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. జగిత్యాల వేదికగా జరిగే ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ద్వారా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ తన పట్టును మరింత సుస్థిరం చేసుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్‌లో దశాబ్దాల కాలం పనిచేసిన జీవన్ రెడ్డి నిర్ణయం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular