చావనైనా చస్తానుగాని నేను పోను
- ప్రియుడు ఇంటిముందు బెటాయించిన ప్రియురాలు
గూడూరు ఏప్రిల్ 06(ప్రజాక్షేత్రం):మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం గుండెంగా గ్రామ శివారు వాగ్య తండాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బేటాయించిన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి. కేసముద్రం మండలం రేకుల తండా కి చెందిన గుగులోతు స్పందన అనే యువతి గుండెగ గ్రామ శివారు వాగ్యతండాకు చెందిన తేజావత్ రఘురాం అనే యువకుడ్ని గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించడం జరిగిందని తెలిపారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట ఇచ్చి పెళ్లి చేసుకోకపోవడంతో ఇంటిముందు బెటాయించి నాకు న్యాయం జరిగేంతవరకు ఇక్కడే కూర్చుని నిరాహార దీక్ష చేస్తానని చావరైనా చస్తాను గాని ఇంటికి తిరిగి వెళ్ళనని భీష్ముంచుకు కూర్చుని నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని తెలిపారు. కుటుంబ సభ్యులు కనపడకుండా పోయారు. ఈ సంఘటనతో రఘురామ్, అతని కుటుంబ సభ్యులు కనపడకుండా పరారయ్యారు.

