రైతు కష్టం పై రాళ్ల వాన!
హైదరాబాద్ ఏప్రిల్ 06(ప్రజాక్షేత్రం):ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ఎదుట ప్రకృతి ప్రళయానికి నాశనం కావడంతో కన్నీటి పర్వంతమైన, రైతన్నలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, రాజన్న జిల్లా, భూపాలపల్లి జిల్లా, సిద్దిపేట జిల్లా, నిజామాబాద్, అదిలాబాద్, లకు చెందిన రైతన్నలకు కోలుకోలేని దెబ్బ తగిలింది, చేతికొచ్చిన పంట కళ్ళముందే రాలిపోతుంటే ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రతిరోజు వాతావరణంలో ఆకస్మిక మార్పులతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరు పులతో కూడిన అకాల వర్షాలు కురవడంతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం స్పష్టంగా కనిపి స్తోంది. ఈ పరిణా మాలపై ముందుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, తీవ్రత మాత్రం అనేక ప్రాంతాల్లో అంచనాలకు మించినట్టు గాఉంది. ప్రధానంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ అకాల వర్షాలు పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి, మక్కజొన్న, పప్పుధాన్యా లు నేలకూలిపోవడం, తడిసిపోవడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మిర్చి, పత్తి వంటి వాణిజ్య పంటలు నాణ్యత కోల్పోయే ప్రమా దం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అకాల వర్షాల వెనుక వాతావరణ మార్పులు కీలక కారణంగా భావిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల ధాన్యం తడిసి నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇది మార్కెట్ ధరలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైందని అధికా రులు చెబుతున్నప్పటికీ, గ్రౌండ్ లెవెల్లో నష్టాల అంచనా, పరిహారం వంటి అంశాలు రైతులలో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ సహాయం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

