📄 ePaper
Saturday, April 11, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణ99 రోజుల కార్యక్రమంలో అధికారులు బిజీ

99 రోజుల కార్యక్రమంలో అధికారులు బిజీ

📰 Generate e-Paper Clip

99 రోజుల కార్యక్రమంలో అధికారులు బిజీ

రెండు నెల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేసిన నిర్మాణాలను పూర్తిచేసే కార్యక్రమంలో అక్రమ నిర్మాణదారులు బిజీ

జిహెచ్ఎంసి సీజ్ బ్యానర్ స్టిక్కర్ల తొలగింపు

కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 07(ప్రజాక్షేత్రం):నిజాంపేట్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో బిజీగా ఉన్న అధికారుల పనితీరు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఫిబ్రవరి 9న బాచుపల్లి సబ్‌స్టేషన్ సమీపంలో ఒక షెడ్డు పక్కన నిర్మిస్తున్న అక్రమ భవనాన్ని జిహెచ్ఎంసి చట్టం 1955 లోని సెక్షన్ 461-ఏ ప్రకారం టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. అయితే, సీజ్ చేసి రెండు నెలలు గడిచినా తదుపరి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
ఇదే అవకాశంగా తీసుకున్న నిర్మాణదారులు అధికారుల సీజ్ స్టిక్కర్‌ను తొలగించి తిరిగి నిర్మాణ పనులు యథేచ్ఛగా కొనసాగించడం స్థానికులను ఆగ్రహానికి గురిచేస్తోంది. “సీజ్ చేసిన భవనంలోనే ఇలా బహిరంగంగా పనులు సాగుతుంటే, ఇది అధికారుల నిర్లక్ష్యమా? లేక నిర్మాణదారుల బరితెగింపా?” అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
అంతేకాదు, అధికారుల సహకారం లేకుండా ఇలా బహిరంగంగా పనులు కొనసాగడం సాధ్యమేనా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం పాత్రపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని, సీజ్ చేసిన అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటారా? లేక ఇదే నిర్లక్ష్య ధోరణి కొనసాగుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. సీజ్ చేసిన భవనం మళ్లీ పనుల్లోకి రావడం — ఇది చట్టాలపై బహిరంగ సవాల్ కాదా? ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి,బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular