📄 ePaper
Wednesday, June 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఖాకీ ఓవర్ యాక్షన్.. న్యాయం కోసం వస్తే అడవిలో వదిలేసిన ఎస్సై..

ఖాకీ ఓవర్ యాక్షన్.. న్యాయం కోసం వస్తే అడవిలో వదిలేసిన ఎస్సై..

📰 Generate e-Paper Clip

ఖాకీ ఓవర్ యాక్షన్.. న్యాయం కోసం వస్తే అడవిలో వదిలేసిన ఎస్సై..

  • పోలీస్ స్టేషన్ ముట్టడించిన మహిళలు!

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మే 26(ప్రజాక్షేత్రం):రక్షణ కల్పించాల్సిన ఖాకీలే బాధితుల పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తే ఇక సామాన్యులకు దిక్కెవరు? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రభుత్వం ఎంత చెబుతున్నా, క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల ప్రవర్తన వల్ల పోలీస్ శాఖకే మచ్చ వస్తోంది. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఒక వృద్ధురాలికి సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పోలీస్ స్టేషన్‌లో ఘోర అవమానం ఎదురైంది. బాధితురాలిని ఆదుకోవాల్సిన ఎస్సై, ఆమెను నడి అడవిలో వదిలేసి రావడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

అసలేం జరిగిందంటే?

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై క్రాంతి కుమార్ మానవత్వం మరిచి ప్రవర్తించిన తీరు తీవ్ర కలకలం రేపింది. ఝరాసంగం మండలం ఎల్లోయి గ్రామానికి చెందిన నరసమ్మ అనే వృద్ధురాలు పొలం పనులకు వెళ్తుండగా కొందరు దుండగులు ఆమెపై దాడి చేశారు. ఆమె మెడలోని బంగారు గొలుసు, వెండి ఆభరణాలను లాక్కొని పారిపోయారు. ఈ చైన్ స్నాచింగ్ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు నరసమ్మ పోలీస్ స్టేషన్‌కు రాగా, ఎస్సై క్రాంతి కుమార్ వింతగా ప్రవర్తించారు. అసలు దొంగతనమే జరగలేదంటూ బాధితురాలితో వాదనకు దిగారు. అంతటితో ఆగకుండా, ఘటన జరిగిన స్థలాన్ని చూపిస్తానంటూ వృద్ధురాలిని విచారణ పేరుతో పోలీస్ వాహనంలో ఎక్కించుకొని వెళ్లారు. కానీ, ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న దట్టమైన అడవి ప్రాంతానికి తీసుకెళ్లి, ఆమె మాట వినకుండా నడి అడవిలోనే వదిలేసి ఎస్సై తిరిగొచ్చారు. దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధురాలు అడవిలో ఒంటరిగా కన్నీరు పెట్టుకుంటూ, ఎలాగోలా కాలినడకన గ్రామానికి చేరుకుంది. ఎస్సై చేసిన ఈ అమానుష చర్య గురించి తెలుసుకున్న ఎల్లోయి గ్రామ మహిళలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బాధితురాలికి న్యాయం చేయాలని, ఎస్సై క్రాంతి కుమార్ తీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో మహిళలు ఝరాసంగం పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల అనంతరం ఎట్టకేలకు స్థానిక పోలీసులు దిగొచ్చారు. వృద్ధురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేయడంతో మహిళల ఆందోళన తాత్కాలికంగా ముగిసింది. బాధితుల పట్ల ఇంత దురుసుగా ప్రవర్తించిన ఎస్సైపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login