తమిళనాడులో ఘోర ప్రమాదం.. కలెక్టర్ వాహనం ఢీకొని రైతు మృతి!
తమిళనాడులో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోడ్ జిల్లా మేజిస్ట్రేట్ కందస్వామి ప్రయాణిస్తున్న అధికారిక వాహనం.. స్కూటీపై వెళ్తున్న షణ్ముగం అనే రైతును వెల్లాంగ్ కోయిల్ వద్ద ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రైతును ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని కుటుంబీకులు తెలిపారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

