Homeతెలంగాణఆతిథ్య రంగంలో తొమ్మిదో అడుగు.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

ఆతిథ్య రంగంలో తొమ్మిదో అడుగు.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

📰 Generate e-Paper Clip

ఆతిథ్య రంగంలో తొమ్మిదో అడుగు.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

  • కొంపల్లిలో లగ్జరీ హోటల్‌.. ఎస్‌వీఎం కొత్త అధ్యాయం!
  • 88 గదులు.. 11 బ్యాంక్వెట్‌ హాళ్లతో ‘ఎస్‌వీఎం లక్స్‌’ ప్రారంభం

కుత్బుల్లాపూర్‌, అక్టోబర్‌ 26(ప్రజాక్షేత్రం):ఆతిథ్య రంగంలో విస్తరణకు మరో అడుగు.. లగ్జరీ విభాగంలోకి సరికొత్త ప్రవేశం! ఎస్‌వీఎం గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ కొంపల్లిలో ‘ఎస్‌వీఎం లక్స్‌’ పేరుతో నూతన లగ్జరీ హోటల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సంస్థ తొమ్మిదో బ్రాంచ్‌గా ఏర్పాటు చేసిన ఈ ప్రాపర్టీని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష విప్‌ కేపీ వివేకానంద్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

వసతి నుంచి వేడుకల వరకు.. ఒకే వేదిక!

ఎస్‌వీఎం గ్రూప్‌ వ్యవస్థాపకులు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం. వర ప్రసాద్‌ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఈ హోటల్‌లో 88 గదులు, ఆరు నుంచి ఏడు లగ్జరీ సూట్లు, 11 బ్యాంక్వెట్‌ హాళ్లు ఏర్పాటు చేశారు. ఫైన్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌, లాంజ్‌ బార్‌, బోర్డ్‌ రూమ్‌ వంటి సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వివాహాలు, కుటుంబ వేడుకలు, కార్పొరేట్‌ సమావేశాలు, సామాజిక కార్యక్రమాలకు అనువుగా హోటల్‌ను తీర్చిదిద్దారు.

లగ్జరీకి పెద్దపీట.. ఆధునిక సదుపాయాలు

హోటల్‌ రెండో అంతస్తులో రెస్టారెంట్‌, లాంజ్‌ బార్‌ ఉండగా.. మూడు, నాలుగు అంతస్తుల్లో లగ్జరీ గదులు, సూట్లు ఏర్పాటు చేశారు. ఐదు నుంచి ఏడు అంతస్తుల్లో వివిధ వేడుకలు, సమావేశాల నిర్వహణకు బ్యాంక్వెట్‌ హాళ్లు అందుబాటులో ఉన్నాయి. వసతి, భోజనం, సమావేశాలు, వేడుకల నిర్వహణకు సంబంధించిన సదుపాయాలను ఒకే ప్రాంగణంలో అందించడం ఈ ప్రాపర్టీ ప్రత్యేకతగా నిలుస్తోంది.

విస్తరణలో మరో మైలురాయి

ఇప్పటికే ఎనిమిది బ్రాంచ్‌ల ద్వారా సేవలందిస్తున్న ఎస్‌వీఎం గ్రూప్‌.. లగ్జరీ హాస్పిటాలిటీ రంగంలోకి అడుగుపెట్టడం ద్వారా తన సేవల పరిధిని విస్తరిస్తోంది. వ్యక్తిగత అతిథులతో పాటు కుటుంబాలు, వ్యాపార సంస్థలు, వేడుకల నిర్వాహకుల అవసరాలకు అనుగుణంగా సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, స్థానికులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular