Homeతెలంగాణహెచ్‌డీసీసీబీ జనరల్ బాడీ సమావేశంలో శంకర్‌పల్లి, మొకిలా పీఏసీఎస్‌ చైర్మన్లు

హెచ్‌డీసీసీబీ జనరల్ బాడీ సమావేశంలో శంకర్‌పల్లి, మొకిలా పీఏసీఎస్‌ చైర్మన్లు

📰 Generate e-Paper Clip

శంకర్ పల్లి అక్టోబర్ 27(ప్రజాక్షేత్రం):మంగళవారం నిర్వహించిన హెచ్‌డీసీసీబీ జనరల్ బాడీ సమావేశంలో శంకర్‌పల్లి, మొకిలా పీఏసీఎస్‌ చైర్మన్లు బొల్లారం వెంకట్ రెడ్డి, సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్‌పల్లి, శంకర్ పల్లి మొకిల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను కోరారు. సంఘాల అభివృద్ధితో పాటు రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నిధులు ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు.
అనంతరం హెచ్‌డీసీసీబీ సీఈఓ భాస్కర సుబ్రహ్మణ్యం, జనరల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి, ఓఎస్‌డీ మనోజ్ కుమార్‌లను పీఏసీఎస్‌ చైర్మన్లు మర్యాదపూర్వకంగా సన్మానించారు.
ఈ సమావేశంలో పీఏసీఎస్‌ల అభివృద్ధి, నిధుల కేటాయింపు అంశాలపై చర్చించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular