Homeతెలంగాణఒయాసిస్ " వద్ద ఎగిసిపడుతున్న మంటలు

ఒయాసిస్ ” వద్ద ఎగిసిపడుతున్న మంటలు

📰 Generate e-Paper Clip

  • చెత్త వ్యర్ధాల కాల్చివేత
  • పట్టించుకోని అధికారులు

శంషాబాద్ అక్టోబర్ 30(ప్రజాక్షేత్రం):గ్రామాలలో వెలువడిన చెత్త వ్యర్ధాలను కాల్చి వేయడంతో దట్టమైన పొగలు అలుముకుంటున్నాయి. మండల పరిధిలోని నర్కూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఓఎస్ఎస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాల ఎదురుగా గత కొన్ని ఏళ్లుగా చెత్త పారబోస్తున్నారు. ఈ చెత్తను కంపోస్టు ఎరువు గా మార్చాల్సిన అధికారులు కాలుస్తున్నారు. దీంతో ఓయాసిస్ పాఠశాలతో పాటు పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వారు అనారోగ్యం పాలు కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో వివిధ ప్రాంతాలకు చెందిన చెత్త వ్యర్ధాలను ఇక్కడ పారబోసి కాల్చివేస్తుండడం వల్ల చల్లారని మంటలు చెలరేగుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular