చేవెళ్ల అక్టోబర్ 30(ప్రజాక్షేత్రం):చేవెళ్ల మండలంలోని దామరిద్ద గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ కంపెనీ సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ నుంచి నీరు పెద్దఎత్తున వృథాగా పోతోంది. అయినప్పటికీ సంబంధిత మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు తాగునీరు అందించాల్సిన నీరు ఇలా రోడ్లపై వృథాగా పోతుండటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి, నీటి లీకేజీని వెంటనే అరికట్టి పైపులైన్‌కు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజాధనం, తాగునీరు వృథా కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

