నంద్యాల నవంబర్ 15(ప్రజాక్షేత్రం):నంద్యాల జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్-15వ తేదీ ఆదివారం అండర్-19 జిల్లా స్థాయి ఎంపికలు మన పాములపాడులోని, జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ జిల్లాస్థాయి ఎంపికలకు క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనీ, వారి ప్రతిభను కనబరచడం జరిగింది.
మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను డిసెంబర్-19, 20వ తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా పాములపాడు ఏపీ మోడల్ స్కూల్ పి.ఇ.టి కురువ.సాయి కృష్ణ పాల్గొనడం జరిగింది. క్రీడాకారులను ఉద్దేశించి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయని, క్రీడలు మంచి ఉత్సాహాన్ని కలిగిస్తాయని, రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ హుస్సేన్, అశోక్ నాయక్, పుల్లయ్య, వెంకట నరేష్ వ్యాయామ ఉపాధ్యాయులు జానీ, ప్రభాకర్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు, పాల్గొనడం జరిగింది.
రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించిన సాయి కృష్ణ
RELATED ARTICLES

