Homeతెలంగాణవేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో అగ్నిప్రమాదం.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో అగ్నిప్రమాదం.

📰 Generate e-Paper Clip

తెలంగాణ నవంబర్ 15(ప్రజాక్షేత్రం):వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కార్తీక మాసం కావడంతో దర్శనానికి వచ్చిన భక్తులు క్యూలైన్ వద్ద వెలిగించిన దీపాలు ప్రమాదవశాత్తు ఖాళీ స్థలంలో పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆలయం ముందున్న ప్రచార రథం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రాణనష్టం జరగలేదు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular