శంకర్ పల్లి నవంబర్ 18(ప్రజాక్షేత్రం):శంకర్పల్లి మండల పరిధిలోని దొంతాన్ పల్లి గ్రామ శివారులోని ఏ-1 ఫర్నిచర్ షాపులో ఇవాళ తెల్లవారుజామున మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి మోకిల పోలీసులు చేరుకొని ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పి వేశాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

