జాతరకు ముస్తాబైన గంగమ్మ గుడి, గుడి పరిసర ప్రాంతం
వేములపల్లి, జనవరి 31(ప్రజాక్షేత్రం):వేములపల్లి, బుగ్గబాయి గూడెం గ్రామాల మధ్యలో గల శ్రీ గంగమ్మ తల్లి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయాయి అని గుడి కమిటీ సభ్యులు తెలిపారు. పీబ్రవరి 1న ఆదివారం సాయంత్రం యాదవ కులస్థుల గంపల ప్రవేశం గుడి ప్రాంతానికి చేరుకుంటారని 2న జాతర మహోత్సవం ఉంటదని అన్నారు. ఇట్టి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో గుడి పరిసరప్రాంతాలను “జెసీబీతో” సదనంచేయడం జరిగిందని, కరెంట్ డిపార్ట్మెంట్ వారు విద్యుత్ ధ్విపాలను ఏర్పాటు చేశారని కమిటీ ఆధ్వర్యంలో గుడికి మరియు దేవత విగ్రహలకు చక్కటి రంగులతో తీర్చి దిద్దడం జరిగిందని, జాతరలో ఎలాంటి అవాంచానియా సంఘటనలు జరగకుండా స్థానిక పోలీస్ వారి సహకారం తీసుకోవడం జరిగిందని అన్నారు. మండలంలోని గ్రామాల ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలనీ కమిటీ సభ్యులు కోరారు.

