మహబూబ్ నగర్ కలెక్టర్గా ఖుష్బూ గుప్త
మహబూబ్ నగర్ జిల్లా, ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా ఖుష్బూ గుప్తను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్గా సేవలందించిన విజయేందిర బోయి బదిలీ కావడంతో, ప్రభుత్వం ఖుష్బూ గుప్తకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. గతంలో వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేసిన ఆమె, జిల్లా అభివృద్ధిపై తనదైన ముద్ర వేస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

