📄 ePaper
Monday, September 7, 2026
📄 ePaper
Homeతెలంగాణచిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌కు పితృవియోగం

చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌కు పితృవియోగం

📰 Generate e-Paper Clip

చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌కు పితృవియోగం

– చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌కు పితృవియోగం

– ఆయన తండ్రి సౌందర్‌రాజన్ (90) వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస

– ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సౌందర్‌రాజన్

– ఆయన మృతి పట్ల భక్తులు, అర్చక సమాజం సంతాపం

మొయినాబాద్ ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సౌందర్‌రాజన్ (90) వృద్ధాప్య సమస్యలతో శుక్రవారం కన్నుమూశారు. చిలుకూరులోని తన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సౌందర్‌రాజన్ చాలా సంవత్సరాలుగా చిలుకూరు బాలాజీ ఆలయంలో అర్చక సేవలు అందించారు. ఆధ్యాత్మిక సేవలో ఉంటూనే ఉన్నత విద్యను అభ్యసించడం ఆయన ప్రత్యేకత. కామర్స్ లెక్చరర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ స్థాయి వరకు ఎదిగి పదవీ విరమణ చేశారు. ఆలయ సాంప్రదాయాలను పాటిస్తూనే విద్యా రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. సౌందర్‌రాజన్‌కు ముగ్గురు కుమారులు కాగా, వారిలో రెండోవారైన రంగరాజన్ ప్రస్తుతం చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడిగా సేవలు అందిస్తున్నారు. సౌందర్‌రాజన్ మరణ వార్త తెలియగానే అర్చక సమాజం, భక్తులు, పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular