📄 ePaper
Saturday, May 23, 2026
ads
📄 ePaper
Homeబిజినేసస్వంట గ్యాస్‌ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!!

వంట గ్యాస్‌ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!!

📰 Generate e-Paper Clip

వంట గ్యాస్‌ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!!

హైదరాబాద్ మార్చి 05(ప్రజాక్షేత్రం):వంటగ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. వంట గ్యాస్ సరఫరాకు గండం పొంచి ఉంది. పశ్చిమా సియాలో నెలకొన్ని ఉద్రిక్తతల ప్రభావం చమురు సరఫరా పై పడింది. దీంతో.. నాలుగు రోజులుగా వంట గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ ఒత్తిడి పెరుగుతోంది. దీంతో.. అనధికారికంగా ఆంక్షలను ఆయిల్ కంపెనీలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా వినియోగదారుల్లో మరింత ఆందోళన పెరుగుతోంది. బుకింగ్ కోసం తాజాగా నిర్దేశించిన గడువు పూర్తియిన తరువాతనే రిజిస్టర్ చేసుకోవటం ఈ ఆందోళనకు కారణంగా నిలుస్తోంది.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో వంటగ్యాస్‌ (ఎల్‌పిజి) సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముడి చమురు నిల్వలు దాదాపు 8 వారాల వరకు ఉన్నప్పటికీ, సరఫరా పూర్తిగా నిలిచిపోతే ఇంధన రేషనింగ్‌ చేయాల్సిన గడ్డు పరిస్థితి తప్పదనే అంచనాలు మొదలు అయ్యాయి. ఫలితంగా డొమెస్టిక్ వంట గ్యాస్ వినియోగదారులు ముందుగానే గ్యాస్ రీఫిల్స్ కోసం పెద్ద ఎత్తున బుక్ చేసుకుంటున్నారు. గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ బుకింగ్ కోసం వినియోగదారులు పెద్ద సంఖ్యలో బుక్ చేసుకుంటున్నారు. ఒత్తిడి పెరుగుతున్న వేళ ప్రధాన అయిల్ కంపెనీల డీలర్లు అనధికారికంగా సిలిండర్ బుకింగ్ పైన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇందు కోసం డబుల్ సిలిండర్ ఉన్న వారికి 30 రోజులు.. సింగిల్ సిలిండర్ ఉన్న వారికి 21 రోజులు గడువుగా నిర్దేశించారు.సిలిండర్ల బుకింగ్ పై ఆంక్షలు చివరి సిలిండర్ అందుకున్న రోజు నుంచి 21 రోజుల తరువాత అయితేనే గ్యాస్ సిలిండర్ తిరిగి బుక్ చేసుకుంటామని చెబుతున్నారు. ఆయిల్ కంపెనీల నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాకపోయినా… వినియోగదారుల నుంచి పెరుగుతున్న బుకింగ్ ఒత్తిడిని తగ్గించేందుకు ఈ ఆంక్షలను అమలు చేస్తున్నారు. యుద్ద ప్రభావంతో రానున్న రోజుల్లో వంట గ్యాస్ కు కొరత ఏర్పడుతుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో.. గతం కంటే భిన్నంగా ఒకే సారి రెట్టింపు సంఖ్యలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ లు జరుగుతున్నాయి. నిర్దేశిత గడువు మేరకే బుకింగ్స్ జరిగే విధంగా ఆయిల్ కంపెనీలు వినియోగదారులు ఉపయోగించే పోర్టల్స్, యాప్ ల సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసారు. దీంతో.. ఈ యుద్దం మరింత కాలం కొనసాగితే వంట గ్యాస్ తో పాటుగా పెట్రోల్, డీజిల్ సరఫరాలోనూ సమస్యలు వస్తాయనే చర్చ సాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login