📄 ePaper
Sunday, May 24, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణలో మరోసారి భారీ వర్షాల హెచ్చరిక… రైతులకు మళ్లీ ముప్పు.

తెలంగాణలో మరోసారి భారీ వర్షాల హెచ్చరిక… రైతులకు మళ్లీ ముప్పు.

📰 Generate e-Paper Clip

తెలంగాణలో మరోసారి భారీ వర్షాల హెచ్చరిక… రైతులకు మళ్లీ ముప్పు.

  • ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజులు వర్షాలు.
  • ఉరుములు, వడగండ్ల వానలకు అప్రమత్తం కావాలంటూ హెచ్చరిక.
  • ఇప్పటికే పంటలకు భారీ నష్టం… రైతుల్లో ఆందోళన.

హైదరాబాద్‌ మార్చి 19(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల మంగళ, బుధవారాల్లో కురిసిన అకాలవర్షంతో అతాలకుతలమైన రైతులకు వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. తెలంగాణలో మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్నిచోట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అకాల వర్షాలు పంటలకు నష్టం కలిగించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాగా, అకాలవర్షంతో రైతులు అతలాకుతలం అయ్యారు. పలుచోట్ల వివిధ రకాల పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్‌ జిల్లాలో 8.7, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 16.1, మంచిర్యాల జిల్లాలో 9.6, నిర్మల్‌ జిల్లాలో 0.2 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఆయా జిల్లాల్లో అకాల వర్షాలు పత్తి, పుచ్చ, మామిడి, జొన్న, బొప్పాయి, వరి పంటలను దెబ్బతీసింది. రైతులు కల్లాలు, ఇండ్లలో ఆరబోసుకున్న పెసర, పసుపు పంటలు తడిసిపోయాయి. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో రెండురోజులపాటు కురిసిన అకాల వాన అపార నష్టాన్ని తెచ్చి పెట్టింది. వీణవంక మండలంలో 50 మంది రైతులకు చెందిన 260 ఎకరాల్లో మక్క నేలకొరిగింది.
శంకరపట్నం మండలం రాజాపూర్‌ గ్రామంలో చింతిరెడ్డి ఆదిరెడ్డి ఇంటి సమీపంలో కొబ్బరి చెట్టుపై భారీ పిడుగుపడి, మంటలు చెలరేగి దగ్ధమైంది. కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 20 ఎకరాల్లో మక్కకు నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం కూనారం, వెన్నంపల్లి, గంగారం, మంగపేట గ్రామాల్లో సుమారు 500 ఎకరాల మక్క పంట నేలకొరిగింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వివిధ పంటలు దెబ్బతిన్నాయి. కొందుర్గు మండల కేంద్రంలో మక్కజొన్న పంట దెబ్బతిన్నది. ఖమ్మం జిల్లా మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు, చింతకాని మండలాల్లో చేతికొచ్చిన మక్కజొన్న నేలవాలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో రైతులు కల్లాల్లో ఆరబెట్టిన మక్కజొన్న, మిర్చి తడిసిపోయింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login