దళితులపై దాడులు చేస్తే సాహించం
- పద్మాశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్
- దళితులపై జరిగిన దాడి రాజ్యాంగం పై జరిగిన దాడే
- దళితులపై జరుగుతున్న దాడులను మందకృష్ణ మాదిగ ఖండన
- దళితుల ఆత్మగౌరవ నిరసన షాబాద్ ర్యాలీకి మందకృష్ణ రాక
చేవెళ్ళ మార్చి 28(ప్రజాక్షేత్రం):షాబాద్ లో దళిత జర్నలిస్తుల మీద వరుసదాడుల నేపత్యంలో మాదిగ జర్నలిస్టుల ఫోరం (ఎంజేఎఫ్ )నియోజకవర్గం కన్వీనర్ మహేష్ ఆశిగారి మాదిగ , ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు శంకర్ రావుమాదిగ , ఎమ్మార్పిఎస్జి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగళ్ల ప్రవీణ్ మాదిగ జర్నలిస్టు శేఖర్ శివగళ్ల మాదిగ , ఆధ్వర్యంలో పద్మశ్రీ గ్రహిత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ను శనివారం నగరంలోని ఆయన నివాసంలో మందక్రిష్ణ మాదిగను కలిశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో దళిత జర్నలిస్టులపై, దళితులపై జరుగుతున్న వరుస దాడులపై మందకృష్ణ మాదిగ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ… ఇటీవల రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దళిత జర్నలిస్టులపై, దళితులపై జరిగిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని రాజ్యాంగం పై జరిగిన దాడిగానే చూస్తామని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. దళిత జర్నలిస్టులపై దాడి జరిపిన వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వ్యక్తులపై నేటికీ కేసు నమోదు చేసి రిమాండ్ చేయకపోవడం దళితులను అవమానించడమేనని మండిపడ్డారు. ఎంజేఎఫ్ నేతృత్వంలో త్వరలో షాబాద్ లో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో దళితులు ఆత్మగౌరవ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ శేఖర్ శివగల్ల మాదిగ, తాళ్లపల్లి మల్లేష్ మాదిగ, అడ్వకేట్ ప్రభాకర్, షాబాద్ మండల బిజెపి యువ నాయకుడు విక్రమ్ రెడ్డి, ఎం జె ఎఫ్ శంకర్పల్లి మండలం కన్వీనర్ సంజీవ, తదితరులు పాల్గొన్నారు.

