📄 ePaper
Wednesday, June 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణకలెక్టర్ గారు ఇటు చూడండి - ప్రభుత్వ వేతనం.. ప్రైవేట్ సేవలు..

కలెక్టర్ గారు ఇటు చూడండి – ప్రభుత్వ వేతనం.. ప్రైవేట్ సేవలు..

📰 Generate e-Paper Clip

కలెక్టర్ గారు ఇటు చూడండి..

– ప్రభుత్వ వేతనం .. ప్రైవేట్ సేవలు

– షాద్‌నగర్‌ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మిపై విచారణ

– విచారణ పేరిట ‘అధికారుల’ కంటితుడుపు చర్యలు

– అదంతా పక్కకు పెట్టండి – ముందు సంతకాల రిజిస్టర్ బుక్ ఎలా బయటకు వచ్చింది..?

– విచారణ అధికారుల కొత్త డౌట్..!

– విచారణ సగం ముగిసింది – ఇంకా సగం విచారించాలి

– విచారణలో ఒకరిపై మరొకరు పరనింద పారాయణం

షాద్‌నగర్, మార్చి 28(ప్రజాక్షేత్రం):ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టం చేయాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, సొంత వ్యాపారాల కోసం విధులకు గైర్హాజరవుతూ, అటెండెన్స్ రిజిస్టర్‌లో ‘ప్రాక్సీ’ సంతకాలతో మాయాజాలం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్‌ఓ (Dy.DM&HO) డాక్టర్ విజయలక్ష్మిపై విచారణ మొదలైంది. శనివారం షాద్‌నగర్‌కు ఈ వ్యవహారం విచారణ నిమిత్తం వచ్చిన రంగారెడ్డి జిల్లా వైద్యశాఖ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ షఫీ, సూపరిండెంట్ మల్లికార్జున్ లు వచ్చారు. షాద్ నగర్ డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ రిజిస్టర్ లో నెలసరి సంతకాలు ఒకేసారి పెట్టుకోవడం, ప్రైవేటు ఆసుపత్రులకు ప్రచారం చేయడం, మీడియా మంచి కవరేజ్ ఇవ్వాలంటూ నివేదించడం తదితర సంఘటనలను ఉటంకిస్తూ వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆయా పత్రికల్లో సోషల్ మీడియాలో వచ్చిన కథనాలకు జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా వైద్యశాఖ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ షఫీ, సూపరిండెంట్ మల్లికార్జున్ లు వచ్చారు. విచారణ చేపట్టిన అధికారుల విచారణలో సగమే విచారణ జరిగింది.. మరి కొంత విచారణ జరగాలి అంటూ మీడియాకు చెప్పిన విచారణ అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.

విచారణా? లేక కాలయాపనా?

వైద్య శాఖలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన డాక్టర్ విజయలక్ష్మి విధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాల్సిన అధికారులు, బాధ్యతాయుతమైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శించడం విస్మయానికి గురిచేసింది. ఎంక్వయిరీలో ఏం తేలిందని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు, “సగమే విచారణ చేశాం.. ఇంకా బాకీ ఉంది.. కలెక్టర్ ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉంది” అంటూ సమాధానం ఇచ్చి వెళ్ళిపోవడం గమనార్హం. మళ్ళీ ఎప్పుడు వస్తారంటే “చూస్తాం” అనే మొక్కుబడి సమాధానంతో అధికారులు జారుకోవడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు వెనకాడుతున్నారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు నిజాన్ని వదిలి.. సాక్ష్యాన్ని పట్టుకున్న వైనం!

ఈ తతంగంలో విశ్వసనీయ సమాచారం ప్రకారం.. విచారణకు వచ్చిన అధికారులు డాక్టర్ విజయలక్ష్మి చేసిన ‘ప్రాక్సీ’ సంతకాలపై కాకుండా, “అటెండెన్స్ రిజిస్టర్ బయటకి ఎలా వెళ్ళింది?” అనే అంశంపైనే ఎక్కువ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. రామాయణంలో పిడకల వేటలా విచారణ మారబోతుందని అర్థమవుతుంది. అంటే, జరిగిన తప్పును సరిదిద్దడం కంటే, ఆ తప్పును బయటపెట్టిన వారిని వేటాడటమే లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నారా? అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. కళ్ళకు కట్టినట్లుగా అక్రమాలు కనిపిస్తున్నా, సాక్ష్యాలను పక్కన పెట్టి విచారణ దిశను మళ్లించడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? అధికారులంతా ఒక్కటే ఎవరికి ఏ అన్యాయం జరిగినా వాళ్ళ లోపల వాళ్ళు సర్దుకుంటారనేదానికి ఇది నిదర్శనం కాబోతుందా అన్న అనుమానాలు కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వైద్యశాఖ పై దృష్టి సారించాల్సిన అవసరం స్వయంగా ఉంది. విధులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోకపోతే మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే వరసగా మారుతుంది.

ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు..

తెలంగాణ ప్రభుత్వం విద్య మరియు వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ, సామాన్యుడికి మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటుంటే, ఇలాంటి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల వ్యవస్థ పరువు పోతోంది. విధులకు ‘డుమ్మా’ కొడుతూ ప్రభుత్వ జీతం పొందుతున్న అధికారిణిపై చర్యలు తీసుకోకుండా, విచారణ పేరుతో కాలయాపన చేయడం ప్రజాప్రయోజనాలను దెబ్బతీయడమే. ఈ తథంగంపై మీడియా ఇంకా ఎక్కువ ఆధారాలు సేకరిస్తే ఏదో రకంగా వారిని వదిలించుకునే ప్రయత్నం నయానా భయానా చేసేందుకు కూడా వెనకాడడం లేదని అర్థమవుతుంది. ఈ వాస్తవాలను బయటకు తీసిన పాత్రికేయులు, ఇతర మీడియా ప్రతినిధులపై శాఖ పరంగా రిజిస్టర్ ఎలా వారి చేతికి చిక్కింది అన్న కోణంలో ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు రిజిస్టర్ బయటకు పొక్కిన ఘటనలో సిబ్బంది హస్తం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరిగింది. మొదటిరోజు విచారణలో సదరు విభాగంలో పనిచేస్తున్న క్రింది స్థాయి సిబ్బందితో విచారణ అధికారులు దర్యాప్తు జరిపారు. వారితో వాంగ్మూలాన్ని రాయించుకున్నారు. రిజిస్టర్ మీడియాకు ఎవరు అందించారు..? రిజిస్టర్ ఎవరైనా ఇచ్చారా లేక వారే స్వయంగా తీసుకున్నారా? రిజిస్టర్ కు సంబంధించి విచారణ మరొకనలో కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అసలు అధికారి చేసిన నిర్వాకాన్ని దర్యాప్తు బృందం పక్కదారి పట్టించినట్లు అర్థమవుతుంది. త్వరలో పూర్తి వివరాలతో..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login