📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణఘనంగా కౌన్సిలర్ శ్రీకర్ గౌడ్ జన్మదినం.

ఘనంగా కౌన్సిలర్ శ్రీకర్ గౌడ్ జన్మదినం.

📰 Generate e-Paper Clip

ఘనంగా కౌన్సిలర్ శ్రీకర్ గౌడ్ జన్మదినం.

  • సేవా కార్యక్రమాల జోరు.

వనపర్తి, మార్చి 29(ప్రజాక్షేత్రం):23వ వార్డు కౌన్సిలర్ పలుస శ్రీకర్ గౌడ్ 31వ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం వార్డులోని పట్టణ ఇలవేలుపు జమ్ములమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ప్రారంభించారు. ఈ శిబిరంలో వందలాది మందికి షుగర్, రక్తపోటు, కంటి చూపు తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. చికిత్స పొందిన పలువురు మాట్లాడుతూ, శ్రీకర్ గౌడ్ సేవాభావం కలిగిన యువ నాయకుడని, కౌన్సిలర్‌గా ఎన్నికకు ముందునుంచే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని పేర్కొన్నారు. ఆయన్ని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తదుపరి అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం శ్రీకర్ గౌడ్ చేత కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, కాగితాల లక్ష్మీనారాయణ, ఉంగ్లం తిరుమల్, మెకానిక్ శ్రీను, కొల్లాపూర్ రాము, జయరాములు, నందిమల్ల రాములు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular