📄 ePaper
Saturday, April 11, 2026
ads
📄 ePaper
Homeజాతియంతన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్

తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్

📰 Generate e-Paper Clip

తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్

  • తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ సంచలన నిర్ణయం
  • 30 ఏళ్లుగా తన డ్రైవర్ ఉన్న వ్యక్తి కుమారుడికి ఎమ్మెల్యే టికెట్
  • విరుగంపాక్కం అభ్యర్థిగా శబరినాథన్ ను ప్రకటించిన తలపతి
  • వారసత్వ, ధన రాజకీయాలకు భిన్నంగా కొత్త ఒరవడికి శ్రీకారం
  • ప్రకటన వేళ భావోద్వేగానికి గురైన డ్రైవర్, ఆయన కుమారుడు

నేషనల్ బ్యూరో మార్చి 29(ప్రజాక్షేత్రం):కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత తలపతి విజయ్ రాజకీయాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో తన వ్యక్తిగత కారు డ్రైవర్ కుమారుడిని నిలబెడుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత 30 ఏళ్లుగా తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేంద్రన్ పట్ల కృతజ్ఞత చాటుతూ, ఆయన కుమారుడు శబరినాథన్‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. చెన్నైలోని విరుగంపాక్కం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శబరినాథన్‌ను తమ పార్టీ అభ్యర్థిగా విజయ్ ఖరారు చేశారు. వారసత్వ రాజకీయాలకు, ధనబలానికి ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతికి భిన్నంగా, తనను నమ్ముకుని ఉన్న సాధారణ కార్యకర్తలకు, చదువుకున్న యువతకు అవకాశం కల్పిస్తాననే బలమైన సందేశాన్ని ఈ నిర్ణయం ద్వారా విజయ్ ఇచ్చారు. అభ్యర్థిగా శబరినాథన్ పేరును వేదికపై విజయ్ ప్రకటిస్తున్న సమయంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఈ అనూహ్య గౌరవంతో డ్రైవర్ రాజేంద్రన్, ఆయన కుమారుడు శబరినాథన్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నిర్ణయం పట్ల విజయ్ అభిమానులు, టీవీకే శ్రేణులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే నిజమైన నాయకుడి లక్షణమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular