📄 ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
Homeజాతియంలంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం విజయ్ సరికొత్త పంథా!

లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం విజయ్ సరికొత్త పంథా!

📰 Generate e-Paper Clip

లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం విజయ్ సరికొత్త పంథా!

– సమయపాలనతో ఆకట్టుకుంటున్న సీఎం

నేషనల్ బ్యూరో మే 16(ప్రజాక్షేత్రం):తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు సి. జోసెఫ్ విజయ్, తన విలక్షణమైన పనితీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఆయన అనుసరిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన రాష్ట్ర అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మే 10న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ ప్రతిరోజూ నిర్దేశిత సమయానికి పావుగంట ముందే చెన్నైలోని సెయింట్ జార్జ్ కోటలో ఉన్న సచివాలయానికి చేరుకుంటున్నారు. ఇంటి నుంచి స్వయంగా లంచ్ బాక్స్ తెచ్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. భోజన విరామ సమయంలో కూడా తన ఛాంబర్‌కే పరిమితమై, భోజనం ముగించి వెంటనే తిరిగి విధుల్లో నిమగ్నమవుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular