‘తెలంగాణ రక్షణ సేన’లోకి భారీగా చేరికలు
మొయినాబాద్,మే 23(ప్రజాక్షేత్రం):సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ ఒక ప్రత్యేక రాజకీయ శక్తిగా ఎదుగుతోందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. మొయినాబాద్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ ఆశయాలకు ఆకర్షితులై బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిలకు చెందిన సుమారు 20 మంది ముఖ్య నాయకులు తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) లో చేరారు. వీరికి పార్టీ సీనియర్ నాయకులు ఎండి అన్వర్ ఖాన్, షేక్ మహమ్మద్ నూర్ భాయ్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు కుమ్మరి శివ శంకర్, బేగరి రాజు మాట్లాడుతూ.. కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా కేజీ టూ పీజీ ఉచిత విద్య, ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత వైద్యం అందించడమే తమ పార్టీ ఎజెండా అన్నారు. పార్టీలో చేరిన వారిలో నాగారం కృష్ణ యాదవ్, సామ సాయి వర్ధన్ రెడ్డి, కత్తుల నరేందర్, ఎస్. అమర్ యాదవ్, పెండ్యాల గోపాల్, ఎండి పాషా, దొడ్డి సాయి కుమార్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు విక్రమ్, సురేందర్ రెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.

