📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణనిరుపేద కుటుంబానికి చేయూత అందించిన వ్యాళ్ల హరీష్ రెడ్డి

నిరుపేద కుటుంబానికి చేయూత అందించిన వ్యాళ్ల హరీష్ రెడ్డి

📰 Generate e-Paper Clip

నిరుపేద కుటుంబానికి చేయూత అందించిన వ్యాళ్ల హరీష్ రెడ్డి

గోదావరిఖని జూన్ 20(ప్రజాక్షేత్రం):పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలోని 23వ డివిజన్ ప్రగతి నగర్‌కు చెందిన బద్రి లక్ష్మి అనే నిరుపేద మహిళ ఇటీవల తన తల్లిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి వెంటనే స్పందించారు. వి హెచ్ ఆర్ టీం సభ్యులు సమాచారం అందించడంతో హరీష్ రెడ్డి నెల రోజుల పాటు సరిపడే నిత్యావసర సరుకులతో పాటు బియ్యం సంచిని అందజేసి ఆర్థికంగా అండగా నిలిచారు.ఈ సందర్భంగా ఆయన ఫోన్ ద్వారా మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా తమకు సమాచారం అందించాలని బాధితురాలు బద్రి లక్ష్మికి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో బొబ్బిలి సతీష్, కంకల దేవేందర్, బూరుగు వంశీకృష్ణ, కడర్ల శ్రీధర్, శ్రీకర్, వినయ్, మనోజ్, అజయ్ నిజాం తదితరులు పాల్గొన్నారు. స్థానికులు వ్యాల్ల హరీష్ రెడ్డి సేవా కార్యక్రమాలను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular