Homeతెలంగాణసద్దుల బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలి

సద్దుల బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలి

📰 Generate e-Paper Clip

సద్దుల బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలి

  • మండల ప్రజలకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు

వలిగొండ, అక్టోబర్ 17(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మ సందర్భంగా వలిగొండ మండల ప్రజలకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపడుచులంతా బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ తరఫున అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలంతా పోలీసులకు సహకరిస్తూ, ప్రశాంత వాతావరణంలో సద్దుల బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular